ప్రతీ కుటుంబానికి ఏటా రూ.లక్ష జె ట్యాక్స్
ABN, First Publish Date - 2022-05-06T06:34:50+05:30
వైసీపీ పాలనలో కుటుంబానికి ఏటా రూ.1.08 లక్షల జె టాక్స్ వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు.
వైసీపీ పాలనపై ఎమ్మెల్యే రామరాజు ధ్వజం
ఆకివీడు, మే 5: వైసీపీ పాలనలో కుటుంబానికి ఏటా రూ.1.08 లక్షల జె టాక్స్ వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు. పట్టణ పరిధిలో 12, 9, 8 , 7, 6, 5, 4, 3 వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పెంచిన ఇంటి పన్ను పత్రాలను నగర పంచాయతీ కార్యాలయం వద్ద దహనం చేసి గురువారం నిరసన తెలిపారు. ఒక్క చాన్స్ అం టూ జగన్ అధికారం చేపట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. అప్పుడు పాదయాత్రలో ముద్దులు పెట్టి అధికారం చేపట్టిన తరువాత గుద్దులు గుద్దుతున్నారన్నారు. కరెంటు వస్తుందో రాదో తెలియదు కాని బిల్లులు మాత్రం బాదుడే బాదుడు అన్నారు. మహిళలకు భద్రత కరువైందన్నారు. పన్నులు, నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంట్, బస్సు చార్జీల బాదు డుతో పాటు కాకుండా ప్రతీ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. కార్యక్రమంలో మోటుపల్లి రామవర ప్రసాద్, బొల్లా వెంకట్రావు, గొంట్లా గణపతి, అజ్మల్, నౌకట్ల రామారావు, గంధం ఉమా, ఆరీఫ్, దాట్ల రామరాజు, నగేష్‌రాజు, షరీఫ్, మీసాల రవికుమార్, మద్దా నరేష్, నోబుల్, సురేష్, బచ్చు సరళకుమారి, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
ఆచంటలో పర్యటించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ
ఆచంట: జగన్ పాలనలో పెరగని ధర అంటూ ఏది లేదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు. ఆచంటలో గురువారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పితాని పాల్గొన్నారు. ధరల బాదుడు వివరిస్తూ కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. ఈ ప్రభుత్వంలో ప్రజలపై అనేక భారాలు మోపారన్నారు. ఇంటిపై పన్ను, చెత్తపై పన్ను అన్ని రకాల పన్నులతో పాటు ధరలు కూడా పెంచారన్నారు. జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి, గొడవర్తి శ్రీరా ములు, కేతా మీరయ్య, బీరా తిరుపతమ్మ, ఎంపీటీసీ పృథ్వీ, చిలుకూరి సత్యవతి, తమ్మినీడి ప్రసాద్, చిలుకూరి సీతారామ్, బీరా నర్శింహమూర్తి, వైస్ ఎంపీపీ తాళం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాళీపట్నం తూర్పులో టీడీపీలో చేరిన నేతలు
మొగల్తూరు: మండలంలోని కాళీపట్నం తూర్పు గ్రామంలో వైసీపీ, జనసేన పార్టీ అభిమానులు, పలువురు కార్యకర్తలు గురువారం టీడీపీలో చేరారు. వారికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం కొత్తోట, కాళీపట్నం తూర్పు గ్రామ పంచాయతీల పరిధిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ధరల భారంపై నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను గ్రామస్తులకు తెలియచేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మహిళలపై నిత్యం అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరిగాయన్నారు. గుబ్బల నాగరాజు, కత్తిమండ ముత్యాలరావు, జోగి పండు, పాలా రాంబాబు, అడ్డాల బాబ్జి. రేవు పద్మారావు, విప్పర్తి వెంకటేశ్వరరావు, మాదాసు రామకృష్ణ, ముచ్చర్ల శ్రీను, బొక్కా ఏడుకొండలు, జక్కంశెట్టి బాలా జీ, ఏడుకొండలు, పాము శ్రీధర్ దొంగ శ్రీను, తాడివాడ రమేష్, పాలా శివ, డొల్లా రత్నంరాజు, కొల్లాటి బోగరాజు తదితరులు పాల్గొన్నారు.