బురదమయమైన వెంప రోడ్డు పునరుద్ధరించాలి
ABN, First Publish Date - 2022-05-14T05:32:49+05:30
కొద్దిపాటి వర్షానికే బురదమయమైన మొగ ల్తూరు – వెంప రహదారిని పున రుద్ధరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
మొగల్తూరు – వెంప రహదారిపై నిరసన
మొగల్తూరు, మే13: కొద్దిపాటి వర్షానికే బురదమయమైన మొగ ల్తూరు – వెంప రహదారిని పున రుద్ధరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకు డు యడ్ల చిట్టిబాబు మాట్లాడు తూ గోతులు, గొప్పులతో ఉన్న రహదారికి కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచిపోయి బురదమయం అవుతోందన్నారు. ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఈ రహదారి నిర్మించేలోపు తాత్కాలికంగానైనా పంచాయతీ నుంచి నిధులు కేటాయించి గోతులు పూడ్చాలని డిమాండ్ చేశారు.