-
-
Home » Andhra Pradesh » West Godavari » housewife attempts suicide police saved-NGTS-AndhraPradesh
-
వివాహిత ఆత్మహత్యాయత్నం..
ABN , First Publish Date - 2022-05-14T06:49:24+05:30 IST
కుటుంబ కల హాల నేపథ్యంలో ఆత్మహత్యకు య త్నించిన వివాహి తను ఆగిరిపల్లి పోలీసులు కాపాడి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన శుక్రవారం సింగన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంది.
అడ్డుకుని కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు
ఆగిరిపల్లి, మే 13: కుటుంబ కల హాల నేపథ్యంలో ఆత్మహత్యకు య త్నించిన వివాహి తను ఆగిరిపల్లి పోలీసులు కాపాడి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన శుక్రవారం సింగన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. మైలవరం గ్రామానికి చెందిన వివాహిత కుటుంబ కలహాలతో మానసిక వేదనకు గురై ప్రశాంతత కోసం రావిచర్ల పిరమిడ్ ధ్యాన మందిరంలో భర్తతో కలసి ఉంటోంది. అయితే శుక్రవారం ఉదయం నుంచి ధ్యాన మందిరంలో కనిపించకపోవడంతో భర్త వెతకడం ప్రారంభించారు. అయితే వివాహిత సింగన్నగూడెం కురివిడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్టు గ్రామ వలంటీరు జ్యోతిరాశి ఆగిరిపల్లి పోలీసు లకు సమాచారం అందించింది. ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, మహిళా పోలీసు కృష్ణ స్వాతి ఘటనాస్థలికి చేరుకుని ఆమెను కాపాడి స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.

