ఉమా సోమేశ్వరస్వామి ఆలయం వద్ద జ్వాలా తోరణం
ABN, First Publish Date - 2022-11-07T23:55:25+05:30
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమా సోమేశ్వరస్వామి ఆలయం వద్ద సోమవారం రాత్రి జ్వాలా తోరణం వైభవంగా నిర్వహించారు.
యలమంచిలి శివాలయం వద్ద జ్వాలా తోరణం
యలమంచిలి, నవంబరు 7: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమా సోమేశ్వరస్వామి ఆలయం వద్ద సోమవారం రాత్రి జ్వాలా తోరణం వైభవంగా నిర్వహించారు. గుంపర్రు, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం, మేడపాడు, యలమంచిలి, చించినాడ, వైవి.లంక శివాలయాల్లో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజ లు చేశారు. మహిళలు ఉపవాస దీక్షలు ఆచరించారు. నవదంపతులు స్వామి వార్లకు పువ్వు, పిందె సమర్పించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణాల్లో మహిళలు కార్తీక దీపారాధన చేశారు.
Updated Date - 2022-11-07T23:55:25+05:30 IST