తుఫాన్‌తో ఎకరాకు ఐదు బస్తాల ధాన్యం నష్టం

ABN , First Publish Date - 2022-05-14T05:54:09+05:30 IST

తుఫాన్‌ కారణంగా కల్లాలో ధాన్యం తడిచి మొలకెత్తిందని, ఎకరాకు 5 బస్తాలు పైబడి నష్టం ఉంటుందని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు అన్నారు.

తుఫాన్‌తో ఎకరాకు ఐదు బస్తాల ధాన్యం నష్టం
పెనుమంట్రలో మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం నేతలు

పెనుమంట్ర, మే 13: తుఫాన్‌ కారణంగా కల్లాలో ధాన్యం తడిచి మొలకెత్తిందని, ఎకరాకు 5 బస్తాలు పైబడి నష్టం ఉంటుందని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు అన్నారు. మండలంలోని పెనుమంట్ర, బ్రాహ్మణచెరువు, భట్లమగుటూరు, ఆలమూరు గ్రా మాల్లో తడిచిన ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. రామాంజనేయులు, కేతా గోపాలన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కౌలు రైతు అయి న కాడికి అమ్ముకోవలసిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబందనలు కారణంగా రైతు భరోసా కేంద్రాలల్లో అమ్ముకునే పరిస్థితిలేదన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. జోగి చిన కొండ, బొక్కా వెంకటేశులు, కుక్కల శంకరుడు, కవురు నవీన్‌, సత్యనారాయణ, తాడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పెనుగొండ: కౌలు, పేద రైతులకు  దక్కాల్సిన మద్దతు ధర కమిషన్‌ వ్యాపారుల జేబుల్లోకి వెళ్లిపోతుందని సీపీఎం మండల కార్యదర్శి ఎస్‌. వెంకటేశ్వరరావు అన్నారు. పెనుగొండ, సోమరాజుచెరువు, దేవ, ములపర్రు, చినమల్లం, నడిపూడి గ్రామాల్లో ధాన్యం పరిశీలించారు. రైతుల నుంచి కమి షన్‌ వ్యాపారులే ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారన్నారు. మద్ద తు ధరకు కొనుగోలు చేస్తుంది లేనిది అధికారులు పర్యవేక్షించాలని డిమాండ్‌ చేశారు. మిద్దే పుష్పారావు, కౌరు జగన్నాధం, మన్నె వెంకట్రావు పాల్గొన్నారు.


భీమవరం అర్బన్‌: వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా రైతాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంక కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చిన ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకలేకపోయిందన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, అరటి, మామిడి, బొప్పాయి కురగాయ రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read more