జీతాలివ్వండి మహాప్రభో..

ABN , First Publish Date - 2022-05-14T06:19:01+05:30 IST

‘మా జీతాలు మాకు ఇవ్వండి’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ కమిటీ ఆధ్వర్యంలో సిబ్బంది నూజివీడు ట్రాన్స్‌కో ఈఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

జీతాలివ్వండి మహాప్రభో..

నూజివీడు టౌన్‌, మే 13 : ‘మా జీతాలు మాకు ఇవ్వండి’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌  పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ కమిటీ ఆధ్వర్యంలో సిబ్బంది నూజివీడు ట్రాన్స్‌కో ఈఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మే 13వ తేదీ వచ్చినా జీతా లు ఇవ్వకపోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మేనేజ్‌ మెంట్‌ వైఫల్యంతోనే నేటి వరకు జీతాలు వేయకపోవడంపై మండిపడ్డారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు 5వ తేదీలోపు ఈఎమ్‌ ఐలు చెల్లించాల్సి ఉంటుందని జీతాలు సక్రమంగా వేయకపోతే చెక్‌ బౌన్స్‌ల కింద ఉద్యోగులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని సంఘ నాయకులు ఆవేదన చెందారు. ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 


Read more