-
-
Home » Andhra Pradesh » West Godavari » corporation taxes porblems story at eluru dist-NGTS-AndhraPradesh
-
కార్పొరేషన్‌కు పన్నుపోటు
ABN , First Publish Date - 2022-05-14T06:17:17+05:30 IST
ఏలూరు జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు పురపాలక సంఘా ల్లో ఆస్తి పన్నుల వసూళ్లు నెమ్మదిం చాయి.
పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీల వెనుకంజ
పేరుకుపోతున్న బకాయిలతో.. పట్టణాల్లో అభివృద్ధి నామమాత్రమే
కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ పాత బకాయిలే..
ఏలూరు జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు పురపాలక సంఘా ల్లో ఆస్తి పన్నుల వసూళ్లు నెమ్మదిం చాయి. జారీచేసిన డిమాండ్లలో 58 శాతం కూడా వసూలు కావడం లేదు. ప్రజల జీవన వ్యయం భారీగా పెరగడం, ఏటికేడాది రకరకాల పన్నుల పేరుతో బాదేస్తుండడంతో వీటి చెల్లిం పుపై ప్రజలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ క్రమంలో పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏలూరుతోపాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాలి టీల్లో నత్తనడకన సాగుతున్న పన్నుల వసూళ్లపై ఆంధ్రజ్యోతి కథనం.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
ఏలూరు కార్పొరేషన్లోకి ఏడు గ్రామాలు విలీనం కావడంతో జనాభాతోపాటు నగర విస్తీర్ణం పెరిగింది. పన్ను వేస్తోన్న నివాసాలు(అసెస్మెంట్లు) పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 49 వేల 480 అసెస్మెంట్లకు గానూ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు పన్నులు వేశారు. 2021–22 సంవత్సరానికి రూ.27 కోట్ల 72 లక్షలు వసూలు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇందులో ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రూ.16.23 కోట్లను వసూ లు చేసి 58 శాతం వసూలు శాతాన్ని ఏలూరు కార్పొరేష న్ నమోదు చేసుకుంది. రావాల్సిన పన్నులను బకాయిల్లో చూపిస్తూ, ఆదాయాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేశారు. ఇటీవల 2022–23 సంవత్సరానికి నూతన డి మాండ్ నోటీసులను జారీచేయగా రూ.6 కోట్లు వసూలు చేశారు. కాగా గత ఏడాదికి సంబంధించి 13 వేల 539 అసెస్మెంట్లకుగానూ రూ.6.42 కోట్ల విలువైన డిమాండ్లను జారీచేసిన జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ రెవెన్యూ అధికారులు రూ.3.76 కోట్ల వసూళ్లతో అదే 58 శాతాన్ని నమోదుచేశారు. 12 వేల 867 అసెస్మెంట్లకు గానూ రూ.3.98 కోట్ల విలువైన డిమాండ్ నోటీసులకు రూ. 2.62 కోట్లను వసూలు చేసిన నూజివీడు మునిసిపాలిటీ 65.70 వసూలు శాతాన్ని నమోదు చేసి ఏలూరు కార్పొరేషన్ వసూళ్లకు సవాల్ విసురుతోంది.
జీతాలకంటే వసూళ్లు తక్కువ
మునిసిపాలిటీ, కార్పొరేషన్లనో వేల మంది ఉద్యోగులు విధులు నిర్వ హిస్తూ ఏటా కోట్లల్లో జీతాలు అందుకుం టున్నారు. కానీ, పన్ను వసూళ్లలో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 309 మంది శాశ్వత ఉద్యోగులు, 521 మంది తాత్కాలిక ఉద్యోగులు వెరసి 830 మంది పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.2.88 కోట్ల చొప్పున ఏడాదికి రూ.34.56 కోట్ల ను కార్పొరేషన్ చెల్లిస్తోంది. అయితే 010 పద్దు కింద కార్పొరేషన్‌కు జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోన్న నేపథ్యంలో ఉద్యోగులకు జీతాల సమస్య లేకుండా పోయింది. 010 లేకపోతే మాత్రం వసూలు చేసే ఆ మాత్రం పన్నులతో ఉద్యోగులందరూ సగం సగం జీతాలకు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇక్కడ ఉద్యోగుల జీతాలు రూ.34.56 కోట్లు కాగా, ఆస్తి పన్ను విలువ రూ.27.72 కోట్లు ఉండటం కొసమెరుపు. నూజి వీడు మునిసిపాలిటీలో 253 మంది ఉద్యోగస్తులకుగానూ రూ.54 లక్షల 30 వేలు, జంగారెడ్డిగూడెంలో 150 మందికిగానూ రూ.21.68 లక్షలను ప్రభుత్వం జీతాల కింద చెల్లిస్తోంది.
ప్రభుత్వ బకాయిలు
ఏలూరు పరిధి లో ప్రభుత్వ బకాయిలు కొండలా ఉన్నాయి. కోర్టు కేసులు, మొండి బకాయిల కింద కార్పొరేషన్ ఆదాయం పూర్తిగా కాగితాలకు పరిమితమైంది. ఏలూరులో 49 వేల 480 ప్రైవేట్ అసెస్మెంట్లు ఉండగా, 214 ప్రభుత్వ అసెస్మెంట్లు ఉన్నాయి. రూ.7.14 కోట్ల బకాయిలు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ మరో రూ.1.7 కోట్ల డిమాండ్లు వెరసి రూ.8.83 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అందులో ప్రస్తుతానికి కేవలం రూ.6 వేలు మాత్రమే అధికారులు వసూలు చేయగలిగారు. అలాగే కార్పొరేషన్ పరిధిలోని 28,200 అసెస్మెంట్లకుగానూ ప్రస్తుతం రూ.9.35 కోట్ల నీటి పన్నులు గత కొన్నేళ్లుగా బకాయిలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో రూ.3.5 కోట్ల విలువైన డిమాండ్ నోటీసులను అధికారులు జారీచేశారు. బకాయిలు, ప్రస్తుత నోటీసులు వెరసి ఇప్పటి వరకు రూ.12.89 కోట్లను కార్పొరేషన్ అధికారులు డిమాండ్ నోటీసులు జారీ చేయగా, ప్రస్తుతం రూ.74 లక్షలను వసూలు చేసినట్లు అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నారు.
పేరుకుపోతున్న వీఎల్టీ పన్నులు
వేకెండ్ ల్యాండ్(ఖాళీ స్థలా ల) ట్యాక్సుల వసూళ్లలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. పాత బకాయిలను పట్టిం చుకోని అధికారులు, కొత్త డిమాండ్లను జారీ చేయడం మినహా వసూళ్లు చేయలేకపోతున్నారు. పాత బకాయిలు రూ.1.43 కోట్లు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత సంవత్సరం రూ.57 లక్షల విలువైన డిమాండ్లతో కలిపి వీఎల్టీ పన్నుల డిమాండ్ల విలువ రూ.2 కోట్లకు చేరుకుంది. ఇందులో ఇప్పటి వరకు ఏలూరు కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు రాబట్టింది కేవలం రూ.11 లక్షలు మాత్రమే. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆస్తి, నీటి, వీఎల్టీ పన్నుల బకాయిలు రూ.31.52 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా వేసిన డిమాండ్ల విలువ రూ.25.53 కోట్లు వెరసి రూ.57 కోట్లకుపైగా పన్నులను కార్పొరేషన్ వసూలు చేయాల్సి ఉంది.

