స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-14T06:06:59+05:30 IST

‘స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెంచాలి. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశిం చారు.

స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా : కలెక్టర్‌

ఏలూరు రూరల్‌, మే 13 : ‘స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెంచాలి. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పీసీ, పీఎన్‌డీటీ యాక్టు అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి శిక్ష పడేలా ఉండాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మదర్‌, చైల్డ్‌ ట్రాపింగ్‌ వివరాలను పొందుపర్చాలన్నారు. ఫోక్సో యాక్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎ.గ్రేస్‌మేరీకుమారి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Read more