బొగ్గే.. బంగారమాయే !
ABN, First Publish Date - 2022-05-14T06:10:51+05:30
బొగ్గు తయారీ కేంద్రాలు మూత పడు తుండడంతో దీనిపై ఆధారపడే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
మెట్టలో మూతపడుతున్న తయారీ కేంద్రాలు
నల్ల బంగారంగా పిలిచే బొగ్గు.. నిజంగానే బంగా రమైంది. బొగ్గు తయారీ కేంద్రాలు మూత పడు తుండడంతో దీనిపై ఆధారపడే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాలు, తోటల్లో బట్టీలను నెలకొల్పి కట్టెలను కాల్చి బొగ్గు చేసే వారు. అయితే నానాటి కీ ఈ బట్టీలు కనుమరుగ వుతున్నాయి. కట్టెలే బొగ్గు తయారీకి ఆధారం. ప్రస్తుతం అవి దొరకడం లేదు. ఒకవేళ దొరికినా ధర ఆకాశాన్ని అంటుతోంది. రవాణా ఆటోకు రెండు వేలు వెచ్చించినా రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. పుల్లను ఎక్కు వగా పొగాకు బ్యారన్‌లకు తరలిస్తుండడంతో వీటికి గిరాకీ ఏర్పడింది. ఈ క్రమంలోనే బొగ్గు బట్టీల నిర్వహణ వ్యాపారులకు కష్టంగా మారిం ది. మెట్టలో కట్టెలు ఎక్కువగా దొరకడం వల్ల బొగ్గు తయారీకి అనుకూలం. దీంతో ఎక్కువగా కన్పించే ఈ బట్టీలు క్రమేపీ మూతబడ్డా యి. గతంలో పంగిడిగూడెం, గుండుగొలను కుంట, ద్వారకా తిరుమల గ్రామాల్లో ఉండే ఈ బట్టీలు ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలో అరకొరగా కనిపిస్తున్నాయి. కామవరపుకోట, సాగిపాడులలో నిర్వహిస్తున్న రెండు బట్టీల నుండే బొగ్గును కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు కేజీ బొగ్గును రూ.30లకు విక్రయిస్తున్నారు.
– ద్వారకా తిరుమల: