-
-
Home » Andhra Pradesh » West Godavari » bring good name to govt says minister nagarjuna-NGTS-AndhraPradesh
-
ప్రభుత్వానికి పేరు తెస్తా : మంత్రి మేరుగ
ABN , First Publish Date - 2022-05-14T06:52:29+05:30 IST
ఏ రంగంలో ఉన్నా తన మార్కును చూపించానని, సాంఘిక సంక్షేమ పరిపాలనలోను తన మార్కును చూపి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు
నూజివీడు, మే 13: ఏ రంగంలో ఉన్నా తన మార్కును చూపించానని, సాంఘిక సంక్షేమ పరిపాలనలోను తన మార్కును చూపి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నూజివీడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు – నేడు ద్వారా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన బోధనకు, నాణ్యమైన భోజనం, వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇక్కడి నుంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందిన 18 మందిని ఆయన అభినందించారు. విద్యార్థులు మంత్రిని సత్కరించ బోగా ఆయన ఆ విద్యార్థునులనే సత్కరించారు. గురుకుల కార్యదర్శి పవన్‌మూర్తి, ఏఎంవో సంజయ్‌రావ్, బీసీబీ పి.వాసంతి, ప్రిన్సిపల్ జి.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

