-
-
Home » Andhra Pradesh » West Godavari » agriculture advisory board meeting-NGTS-AndhraPradesh
-
సార్వా సాగుకు సమాయత్తం కావాలి
ABN , First Publish Date - 2022-05-14T05:35:43+05:30 IST
రానున్న సార్వా సాగుకు రైతులు సమాయాత్తం కావాలని, సలహా మండలి సభ్యులు కూడా కృషి చేయాలని ఏఈవో జ్యోషిల సూచించారు.
వ్యవసాయాధికారుల సూచన
మొగల్తూరు, మే 13: రానున్న సార్వా సాగుకు రైతులు సమాయాత్తం కావాలని, సలహా మండలి సభ్యులు కూడా కృషి చేయాలని ఏఈవో జ్యోషిల సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. కాలువ నీటిని ఆక్వా చెరువులకు మళ్లించడంతో సాగుకు పూర్తిస్థాయిలో నీరందక ఇబ్బందులు రైతులు పడుతున్నారని పలువురు సభ్యులు పేర్కొ న్నారు. సాగు నీరందిన తరువాతే ఆక్వా చెరువులకు నీరందించే చర్యలు తీసుకోవాలని కోరారు. సార్వా సాగుకు అవసరమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటు ఉంచాలన్నారు. ఈ సమావేశంలో సలహా మండలి చైర్మన్ కంచర్ల బాబులు, డైరెక్టర్లు గూడూరి మావుళ్లు, మోకా నాగశంకరం, కొత్తపల్లి నాగేశ్వరరావు, ఎంపీడీవో ఆర్సి.ఆనంద్‌కుమార్, డీటీ నరేష్, విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
కాళ్ళ: సార్వా సీజన్‌కు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను సరఫరా చేయనున్నట్లు ఏవో సి జయవాసుకి తెలిపారు. కాళ్ళకూరు సొసైటీలో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఎంటీయూ – 1061, 1064, 1121 విత్తనాలను రాయితీపై అందిస్తామన్నారు. జింక్, జిప్సం కూడా సబ్సిడీపై అందించాలని రైతులు కోరారు. సమావేశంలో జిల్లా ఆక్వా సలహా మండలి సభ్యుడు పెన్మెత్స దుర్గాప్రసాదరాజు, వీరమల్లు గంగయ్య, కొల్లి రామకృష్ణ, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
పెంటపాడు: అధికారుల సూచనలు పాటించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఎంపీపీ దాసరి హైమవతి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏవో పార్థసారథి మాట్లాడారు. రైతులు సబ్సిడీపై అందించే అపరాల విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీవో దామోదరరావు, ఇరిగేషన్ జేఈ సుధాకర్‌రెడ్డి, ఏపీఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇరగవరం: సార్వాకు విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందిస్తామని ఏవో సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎస్టీవీ రాజేశ్వరరావు అధ్యక్షతన వ్యవసాయ సలహా మండలి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ నెలలోనే పంట కాలువల పూడిక తీయాలని, రైతులకు వ్యక్తిగతంగా యంత్రాలు అందించాలని, 50 శాతం రాయితీపై జింక్ సల్ఫేట్, జిప్సంను అందించాలని తీర్మానించారు.
లాభసాటిగా పుట్టగొడుగుల సాగు
తాడేపల్లిగూడెం రూరల్: పుట్టగొడుగుల సాగు లాభసాటి అని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు బి.శ్రీనివాసులు అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సలహా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకంపై అంతర్జాల శిక్షణ శుక్రవారం నిర్వ హించారు. సమాచార విశ్లేషకుడిగా ఎస్.నరసింహారావు, శాస్త్రవేత్త చిరం జీవి, కేవికే ప్రధాన శాస్త్రవేత్త కరుణశ్రీ తదితరులు మాట్లాడారు.

