వలంటీర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-14T05:59:21+05:30 IST

దన్నానపేట గ్రామ వలంటీర్‌ తర్లాడ బాలకృష్ణ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

వలంటీర్‌ ఆత్మహత్య

నెల్లిమర్ల: దన్నానపేట గ్రామ వలంటీర్‌ తర్లాడ బాలకృష్ణ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లిమర్ల ఎస్‌ఐ పి.నారాయణరావు కథనం ప్రకారం.. బాలకృష్ణ గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో గ్రామ పొలిమేరలోని వల్లూరు గెడ్డ వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విజయనగరంలోని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. సెల్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడి డబ్బు నష్టపోయిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
 

Read more