తెగిపడిన మహిళ చేయి

ABN , First Publish Date - 2022-05-15T05:10:46+05:30 IST

ప్రయాణంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కిటికీ పక్కన ఉన్న ఓ మహిళ చేయి తెగిపడింది. ఈ ఘటనతో ప్రయాణికులందరూ షాక్‌కు గురయ్యారు

తెగిపడిన మహిళ చేయి
చేయి తెగిపడడంతో రోదిస్తున్న పైడితల్లి

ప్రయాణంలో ఊహించని ప్రమాదం

పాలకొండ (వీరఘట్టం):

ప్రయాణంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కిటికీ పక్కన ఉన్న ఓ మహిళ చేయి తెగిపడింది. ఈ ఘటనతో ప్రయాణికులందరూ షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వీరఘట్టం మండలం నడిమికెల్ల గ్రామానికి చెందిన పేలూరి పైడితల్లి శనివారం పాలకొండ నుంచి స్వగ్రామానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణమైంది. వీరఘట్టంలోని జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోకి వచ్చేసరికి ఆ మహిళ తన కుడి చేయిను బస్సు కిటికీ బయట ఉంచింది. అయితే అదే సమయంలో పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వస్తున్న లగేజీ ఆటో ఇనుప రాడ్డు ఆమె కుడి చేయికి బలంగా రాసుకుంటూ వెళ్లింది. దీంతో ఆమె  చేయి అక్కడికక్కడే తెగిపడింది. ఈ ఘటనతో పైడితల్లి బాధతో విలవిల్లాడింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది ఆమెను వీరఘట్టం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. లగేజీ ఆటో డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 

Read more