నేటి నుంచి టీచర్లకు సెలవులు

ABN , First Publish Date - 2022-05-15T05:11:55+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 15 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

నేటి నుంచి టీచర్లకు సెలవులు

సాలూరు రూరల్‌/గరుగుబిల్లి, మే 14 :  జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 15 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు ఈ నెల ఐదు నుంచి జూలై 3 వరకూ వేసవి సెలవులు ఇచ్చిన విషయం విదితమే.  అయితే ప్రమోషన్‌ జాబితాల తయారీ, తదితర పనులు చేసుకోవాలని ఈ నెల 20 వరకూ ఉపాధ్యాయులకు పనిదినాలుగా తొలుత విద్యాశాఖ ప్రకటించింది. మొత్తంగా  ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఐదు రోజులు ముందుగానే సెలవులు ప్రకటించారు.  ఉపాధ్యాయులు వచ్చే నెల 28న పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంది. పాఠశాలలు జూలై 4న పునః ప్రారంభం కానుండడంతో స్కూల్‌ రడీనెస్‌ కార్యక్రమాలను అప్పటి వరకు నిర్వహించాలని ఆదేశించారు.
 
 

Read more