ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2022-05-14T05:58:31+05:30

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి.

 బైక్‌ బోల్తా పడి యువకుడు..
గజపతినగరం/ మెంటాడ, మే 13:
గజపతినగరం మండలం మరుప ల్లి గ్రామ పరిధిలోని ఓలమ్‌ కంపెనీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. గజపతినగరం ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన మిరిమిల్ల సూరమ్మ, త్రినాథ్‌లకు భగవాన్‌ (19) ఏకైక సంతానం. భగవాన్‌ గజపతినగరంలోని ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. భగవాన్‌ శుక్రవారం పోరాం నుంచి తన బావమరిది రమేష్‌తో కలిసి బొండపల్లిలోని తన బంధువుల ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. గజపతినగరం మండలం ఓలమ్‌ కంపెనీ వద్ద బస్సు ను క్రాస్‌ చేశారు. ఇంతలో ఎదురుగా వచ్చిన భారీ వాహనాన్ని తప్పించ బోతుండగా, బైక్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో భగవాన్‌ తీవ్రంగా గాయ పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో జిల్లా కేంద్రాసు పత్రి కి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలో మృతిచెందాడు.  

కారు ఢీకొని ఒకరు..
 కొత్తవలస:
మండలంలోని నరపాం జంక్షన్‌ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగినరోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధిం చి సీఐ ఎస్‌.బాలసూర్యారావు అందించినవివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని కర్రిచిన్నయ్యపాలెం గ్రామానికి చెందినకర్రి వెంకటరమణ(42) ట్రాక్టర్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొత్తవలసలో ట్రాక్టర్‌ బాగుచేయించే నిమిత్తం ఇంటి వద్ద నుంచి శుక్రవారం బైక్‌పై బయలుదేరాడు. తనతో పాటు అదే గ్రామానికి చెందిన లెంక రాజేష్‌ను తీసుకువెళ్లాడు. నరపాం జంక్షన్‌ సమీపంలోకి వస్తుండగా, అదే సమయంలో కొత్తవలస నుంచి దేవరాపల్లి వైపు వెళుతున్న కారు ఢీకొంది. దీంతో కర్రి వెంకటరమణకు, వెనుక కూర్చున్నలెంక రాజేష్‌ కిందపడి గాయాలపాలయ్యారు. వీరిద్దరినీ చికిత్స నిమిత్తం విశాఖపట్టణం కేజీహెచ్‌కు తరలించారు. వెంకటరమణ చికిత్స పొందుతూ మృతిచెందాడు. లెంక రాజేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య లెంక వరలక్ష్మి ఇచ్చినఫిర్యాదు మేరకు కారుడ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మృతదేహానికి విశాఖపట్టణం కేజీహెచ్‌లోనే శవపంచనామా నిర్వహించి, ఏఎస్‌ఐ రెహమాన్‌ పోస్టుమార్టంకు పంపించారని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.

 లారీ ఢీకొని ఇద్దరు..
బాడంగి:
మండలంలోని రామచంద్రాపురం, ఆకులకట్ట గ్రామాల మధ్యలో శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెం దారు. ఎస్‌ఐ సురేంద్రనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. మెరకముడి దాంలో బంధువుల ఇంటి వద్ద బారసాల కార్యక్రమం ముగించుకొని రామచం ద్రపురం వస్తున్న తోట రాజు (30), నాగూరి సింహాచలం(62)లను వెనుక నుంచి కర్రలలోడుతో వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సింహాచలం స్వగ్రామం మెరకముడిదాం కాగా, రాజుది బాడంగి మండలం రామచంద్రాపురం. రాజు విశాఖలో పెట్రోల్‌ బంకులో పని చేస్తూ బారసాల నిమిత్తం శుక్రవారం వచ్చినట్టు అతని తండ్రి సుందరరావు తెలిపారు. తిరిగి ప్రయాణమై ఇంటికి వచ్చి విశాఖ వెళ్లేలోగా ఈ ప్రమాదం జరిగినట్టు వారు బోరుమంటూ విలపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో ఢీకొని విద్యార్థి..
బొండపల్లి:
బొడసింగి గ్రామ పరిధిలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు.  ఎస్‌ఐ ఆర్‌.వాసుదేవ్‌  తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుర్ల మండలం రాగోలు గ్రామానికి చెందిన మజ్జి అచ్యుతనాయుడు(20) బైక్‌పై విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తుండగా బొడసింగిపేట గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు.  108 వాహనంలో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. అచ్యుత నాయుడు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మృతుడి తండ్రి సత్యారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!