ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఏనుగుల బీభత్సం

ABN, First Publish Date - 2022-05-15T05:14:49+05:30

మండలంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేయగా, ఆవు దూడను చంపేశాయి.

ఏనుగుల దాడిలో మృతి చెందిన దూడను పరిశీలిస్తున్న అటవీశాఖ గార్డు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  ఆవు దూడను చంపిన గజరాజులు
  వ్యవసాయ పరికరాలు ధ్వంసం
జియ్యమ్మవలస, మే 14 :

మండలంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేయగా, ఆవు దూడను చంపేశాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోకి ప్రవేశించిన ఏనుగులు చింతలబెలగాం పంచాయతీ రాజయ్యపేట - దత్తివలస గ్రామాల మధ్య ఉన్న పడాల సత్యం ఇంటిని చుట్టుముట్టాయి. ఇంటి ముందు కట్టి ఉన్న ఆవు దూడను  హతమార్చాయి. పక్కనే ఉన్న ఆవు  తాడు తెంపుకుని పారిపోయింది.   తరువాత పశువుల శాల వద్ద ఉన్న మినీ ట్రాక్టర్‌,  ఇంటి ముందున్న గేటును గజరాజులు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని స్థానికులు అటవీశాఖకు చేరవేయడంతో హుటాహుటిన గార్డు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. దాదాపు గంట వరకూ ఇంటి వద్దనే ఉన్న ఏనుగుల గుంపు తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.  ఏనుగుల తీరు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, వీటిని తరలింపునకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు  కోరుతున్నారు.

 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!