-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Elephant harassment-MRGS-AndhraPradesh
-
ఏనుగుల బీభత్సం
ABN , First Publish Date - 2022-05-15T05:14:49+05:30 IST
మండలంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేయగా, ఆవు దూడను చంపేశాయి.
ఆవు దూడను చంపిన గజరాజులు
వ్యవసాయ పరికరాలు ధ్వంసం
జియ్యమ్మవలస, మే 14 :
మండలంలోకి
శుక్రవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వ్యవసాయ పరికరాలను
ధ్వంసం చేయగా, ఆవు దూడను చంపేశాయి. దీంతో స్థానికులు భయాందోళన
చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోకి ప్రవేశించిన ఏనుగులు
చింతలబెలగాం పంచాయతీ రాజయ్యపేట - దత్తివలస గ్రామాల మధ్య ఉన్న పడాల సత్యం
ఇంటిని చుట్టుముట్టాయి. ఇంటి ముందు కట్టి ఉన్న ఆవు దూడను హతమార్చాయి.
పక్కనే ఉన్న ఆవు తాడు తెంపుకుని పారిపోయింది. తరువాత పశువుల శాల వద్ద
ఉన్న మినీ ట్రాక్టర్, ఇంటి ముందున్న గేటును గజరాజులు ధ్వంసం చేశాయి. ఈ
విషయాన్ని స్థానికులు అటవీశాఖకు చేరవేయడంతో హుటాహుటిన గార్డు వచ్చి
పరిస్థితిని సమీక్షించారు. దాదాపు గంట వరకూ ఇంటి వద్దనే ఉన్న ఏనుగుల గుంపు
తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఏనుగుల తీరు
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, వీటిని తరలింపునకు చర్యలు
తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

