అత్తను చంపిన కోడలు అరెస్టు
ABN, First Publish Date - 2022-05-14T06:00:19+05:30
రావివలసలో అత్తను చంపిన కోడలిని మండల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
గరుగుబిల్లి: రావివలసలో అత్తను చంపిన కోడలిని మండల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రావివలసకు చెందిన గుంట్రెడ్డి రాముడమ్మ(75)ను చిన్న కోడలు గౌరీశ్వరి గురువారం నేలకేసి కొట్టి చంపడంతో పార్వతీపురం ఏఎస్పీ ఎ.సుభాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు గౌరీశ్వరిని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతి రావు, ఎస్ఐ ఎం.రాజేష్‌ల ఆధ్వర్యంలో పార్వతీపురం కోర్టుకు తరలించారు. ఈమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారని ఎస్ఐ రాజేష్ తెలిపారు. కొద్ది రోజుల కిందట పెద్ద కుమారుడు గోవిందరావు ఇంటిలో ఉన్న రాముడమ్మ ఇటీవల చిన్న కుమారుడు శివకుమార్ ఇంటికి చేరుకుంది. ఆస్తి కోసమే చిన్నకోడలు హత్య చేసిందని సమాచారం. అరెస్టు చేసిన గౌరీశ్వరిని గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించి తదుపరి పార్వతీపురం కోర్టుకు తరలించారు.