సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

ABN , First Publish Date - 2022-05-15T05:15:36+05:30 IST

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాఽథ్‌ ఆదేశించారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

 
వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఐటీడీఏ పీవో ఆదేశం

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, మే 14 :

 సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాఽథ్‌ ఆదేశించారు. శనివారం ఆయన ఆయా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ..  అకాల వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయని, ప్రతి ఒక్కరూ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.   డెంగ్యూ, మలేరియా, అతిసార, తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం విధిగా  డ్రై డే పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  స్ర్పేయింగ్‌ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, మండల అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగే విధంగా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డీటీసీవో విజయ్‌కుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Read more