ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Viveka హత్య కేసు నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-05-13T00:36:08+05:30

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. సీబీఐ, నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టు విన్నది

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. సీబీఐ, నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టు విన్నది. వివేకా హత్య వెనక కుట్ర ఉందని సీబీఐ న్యాయవాది తెలిపారు. జైలు నుంచే నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ వాదించింది. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా ఏ5 పాత్ర నిర్ధారణ అయిందని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. వివేకా కేసులో కుట్రలను వెలికి తీయాల్సి ఉందని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. సీబీఐ ఇప్పటికే రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసిందని న్యాయవాది తెలిపారు. ఏ4 కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ మినహా వేరే సాక్ష్యం లేదని సీబీఐ వాదించింది. వివేకా కేసులో నిందితులు దేవిరెడ్డి శివశంకర రెడ్డి, గజ్జల ఉమామహేశ్వర రెడ్డి, సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ ఇవ్వాలని నిందితుల తరపు లాయర్లు కోరారు. కనీసం ఆంక్షలతోనైనా బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ న్యాయవాదుల వాదించారు. నిందితులు బయటకు వస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని హైకోర్టు అడిగింది. అధికారులతో మాట్లాడి తెలుపుతామని సీబీఐ న్యాయవాదులు చెప్పారు. కేసు విచారణ వచ్చే గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!