నిత్య జీవనంలో యోగా భాగం కావాలి
ABN, First Publish Date - 2022-05-15T05:07:46+05:30
యోగా సాధన నిత్య జీవితంలో భాగం కావాలని ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్ అన్నారు.
ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్
బీచ్ రోడ్డు మే 14: యోగా సాధన నిత్య జీవితంలో భాగం కావాలని ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఏయూ యోగా విలేజ్‌లో ఎన్‌ఎస్‌ఎస్, వర్సిటీ యోగా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు యోగా ఉపకరణంగా నిలుస్తుందని, శారీరక వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం స్వీకరించడం ఎంతో అవసరమన్నారు. ఆరోగ్య భారతావని యోగా సాధనతోనే సాధ్యమవుతుందన్నారు. యువత తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. యోగా విభాగాపతి ఆచార్య ప్రొఫెసర్ కె.రమేశ్‌బాబు మాట్లాడుతూ వేద సంపదగా యోగా నిలుస్తుందని, శరీరంపై, మనసుపై నియంత్రణ కలిగించే శక్తి యోగాకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ డైరెక్టర్ భానుకుమార్, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త హరనాథ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు యోగాసనాలు వేశారు.