ఇతర జిల్లాలకు 37 మంది టీచర్లు బదిలీ

ABN , First Publish Date - 2022-05-14T05:53:15+05:30 IST

విశాఖ జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేస్తున్న 37 మంది ఉపాధ్యాయులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.

ఇతర జిల్లాలకు 37 మంది టీచర్లు బదిలీ

భీమునిపట్నం(రూరల్‌),  మే 13: విశాఖ జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేస్తున్న 37 మంది ఉపాధ్యాయులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. వీరికి శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి రిలీవింగ్‌ ఆర్డర్లు ఇచ్చారు. అంతర్‌ జిల్లాల బదిలీల కోసం గతంలో వీరు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా స్పౌస్‌ కేటగిరికి చెందడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీరిని తక్షణం విధుల నుంచి రిలీవ్‌ చేశారు. వీరిలో 21 మంది ఎస్టీజీలు, 16 మంది స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. 



Read more