-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » tragedy at picnic
-
పిక్నిక్‌లో విషాదం
ABN , First Publish Date - 2022-11-07T01:33:02+05:30 IST
పిక్నిక్ సరదా ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొంది. కుటుంబంతో కలిసి వెళ్లిన అతడి స్నానం సరదా ప్రాణాలను హరించింది.
- కాశీపట్నం వద్ద గోస్తనీలో స్నానానికి దిగిన విశాఖ యువకుడి మృతి
అనంతగిరి రూరల్, నవంబరు 6:
పిక్నిక్ సరదా ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొంది. కుటుంబంతో కలిసి వెళ్లిన అతడి స్నానం సరదా ప్రాణాలను హరించింది. నదిలోకి దిగిన అతడు ఊబిలోకి కూరుకుపోయి మృతిచెందాడు. అనంతగిరి మండలం కాశీపట్నం వద్ద ఆదివారం ఈ సంఘటన జరిగింది. కళ్లముందే కుమారుడు తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
నగరంలోని పాతగోపాలపట్నానికి చెందిన బద్ది గోపి జీవీఎంసీలో ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. ఆయన తన భార్య, ఇద్దరు కుమారులు, స్నేహితులతో కలిసి ఆదివారం అనంతగిరి మండలంలోని పర్యాటక ప్రదేశం కాశీపట్నం వచ్చారు. విశాఖ అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారి పెద్ద కుమారుడు బద్ది ఉదయకుమార్ (19) స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు గోస్తనీలో దిగాడు. అతడు దిగిన ప్రాంతంలో ఊబి ఉండడంతో కూరుకుపోయి మృతి చెందాడు. వెంటనే అనంతగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read more

