మూడేళ్లలో ప్రజలకు ముప్పుతిప్పలు

ABN , First Publish Date - 2022-05-14T06:18:45+05:30 IST

మూడేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ముప్పుతిప్పలు పెట్టి, ఇప్పుడు ఏ ముఖంపెట్టుకుని గడప గడపకు వెళ్తారని వైసీపీ నాయకులను మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రశ్నించారు. మండలంలోని కాశీపురంలో శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు.

మూడేళ్లలో ప్రజలకు ముప్పుతిప్పలు
విలేఖర్లతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు

 రాష్ట్రాభివృద్ధిని విస్మరించి ప్రజల వద్దకు ఎలా వెళతారు?

  వైసీపీ పాలకుల తీరును ఎండగట్టిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి

దేవరాపల్లి, మే 13 : మూడేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ముప్పుతిప్పలు పెట్టి, ఇప్పుడు ఏ ముఖంపెట్టుకుని గడప గడపకు వెళ్తారని వైసీపీ నాయకులను మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రశ్నించారు. మండలంలోని కాశీపురంలో శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుం టుపడిందన్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరికీ నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ.. జగన్‌మోహన్‌రెడ్డి మాయమాటలు చెప్పారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకలేని విధంగా ధరలు పెంచుకు పోతున్నారని మండిపడ్డారు. వలంటీర్‌ వ్యవస్థతో తమకున్న పదవులకు కనీసం విలువలు లేకుండా ఉందని వైసీపీ నాయకులే బహిరంగంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు సూర్యనారాయణ, సర్పంచ్‌ ఆదిరెడ్డి వరలక్ష్మి, రాంపురి, మహేశ్వరినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Read more