ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

స్టీల్‌ప్లాంట్‌కు ముడి సరకు కొరత కేంద్రం చలువే

ABN, First Publish Date - 2022-05-14T05:53:56+05:30

విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి సరకు రాకుండా కేంద్రం కుట్రలు చేస్తున్నదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ ఆరోపించారు.

రిలే దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న డి.ఆదినారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పరిరక్షణ పోరాట కమిటీ  చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, మే 13: విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి సరకు రాకుండా కేంద్రం కుట్రలు చేస్తున్నదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ  చైర్మన్‌ డి.ఆదినారాయణ ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 456వ రోజు కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో ఎంఎంఎస్‌ఎం, డబ్ల్యూఆర్‌ఎం, ఎస్టీఎం విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్న ఉక్కు కర్మాగారానికి కోల్‌ సరఫరా లేక పోవటంతో ఇప్పటికే బ్లాస్ట్‌ఫర్నేస్‌--3 నిలిచిపోయిందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా ఐక్య పోరాటాలు చేస్తామని వివరించారు. పోరాట కమిటీ నాయకులు జి.ఆనంద్‌, జె.రామకృష్ణ, రాజబాబు, జి.గోపి, వి.ప్రసాద్‌, నరేంద్ర, పిట్టారెడ్డి, దేముడు, రమణారావు, రమేశ్‌, రాజేశ్వరరావు, వర్మ, మోహన్‌ కుమార్‌, కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!