-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » The raw material shortage center for the steel plant is dying-NGTS-AndhraPradesh
-
స్టీల్‌ప్లాంట్‌కు ముడి సరకు కొరత కేంద్రం చలువే
ABN , First Publish Date - 2022-05-14T05:53:56+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి సరకు రాకుండా కేంద్రం కుట్రలు చేస్తున్నదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ ఆరోపించారు.
పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, మే 13: విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి సరకు రాకుండా కేంద్రం కుట్రలు చేస్తున్నదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 456వ రోజు కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో ఎంఎంఎస్‌ఎం, డబ్ల్యూఆర్‌ఎం, ఎస్టీఎం విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్న ఉక్కు కర్మాగారానికి కోల్ సరఫరా లేక పోవటంతో ఇప్పటికే బ్లాస్ట్‌ఫర్నేస్--3 నిలిచిపోయిందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా ఐక్య పోరాటాలు చేస్తామని వివరించారు. పోరాట కమిటీ నాయకులు జి.ఆనంద్, జె.రామకృష్ణ, రాజబాబు, జి.గోపి, వి.ప్రసాద్, నరేంద్ర, పిట్టారెడ్డి, దేముడు, రమణారావు, రమేశ్, రాజేశ్వరరావు, వర్మ, మోహన్ కుమార్, కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

