ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-05-15T04:45:37+05:30

ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల డిమాండ్లను ప్రభు త్వం పరిష్కరించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధ రించాలని ఏపీ టీచర్స్‌ ఫెడ రేషన్‌ (ఏపీటీఎఫ్‌) జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్‌.వి.వీర భద్రరావు కోరారు.

జిల్లా జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రరావు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.వీరభద్రరావు

విశాఖపట్నం, మే 14: ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల డిమాండ్లను ప్రభు త్వం పరిష్కరించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధ రించాలని ఏపీ టీచర్స్‌ ఫెడ రేషన్‌ (ఏపీటీఎఫ్‌) జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్‌.వి.వీర భద్రరావు కోరారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాధవధార జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో శని వారం ఏపీటీఎఫ్‌ జిల్లా జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.


ఈ సమా వేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మాతృభాషలో బోధన చేపడుతూ, ఆంగ్లం, ఇతర భాషలను ఆప్షనల్‌గా కొనసాగించాలని కోరారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపాలన్న ఆలోచనకు స్వస్తిపలికి ప్రాథమిక పాఠశాల వ్యవస్థ కొనసాగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.


జిల్లా అధ్యక్షునిగా ధనుంజయరావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.వీరభద్రరావులను సభ్యులు ఎన్నుకున్నారు. అసోసియేట్‌ అధ్యక్షునిగా చంద్రకుమారి, అడిషనల్‌ కార్యదర్శిగా శివజ్యోతి, ఉపాధ్యక్షులుగా ప్రసాద్‌, ఎల్లారావు, శ్రీనివాసరావు నియమితులయ్యారు. కార్యదర్శులుగా రమాకృష్ణ, కృష్ణారావు, రవీంద్ర, పవన్‌ కుమార్‌, కృష్ణకుమారిలను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నూతన కార్యవర్గంతో జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.ఎస్‌.నాయుడు ప్రమాణం చేయించారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!