ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అత్యాచారాల నివారణకు కఠిన శిక్షలను విధించాలి

ABN, First Publish Date - 2022-05-15T05:14:27+05:30

మహిళలపై అత్యాచారాలను నివారించేందుకు కఠినమైన శిక్షలను విధించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్‌

సిరిపురం, మే 14: మహిళలపై అత్యాచారాలను నివారించేందుకు కఠినమైన శిక్షలను విధించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. అత్యాచార నిరోధక పోరాట వేదిక ఏర్పాటు నిమిత్తం మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సన్నాహక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పుట్టిన పసికందు నుంచి వృద్ధురాలి వరకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింసను, అత్యాచారాలను అరికట్టేందుకు జస్టిస్‌ వర్మ కమిషన్‌ చేసిన సిఫార్సులు, సంస్కరణలను అమలు చేసి నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు ఒక ఐక్యవేదిక అవసరమని ఈ సందర్భంగా తీర్మానించారు. త్వరలో భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, కార్యదర్శి రోహిణీదేవి, అధ్యక్షురాలు ఎస్‌.వెంకటలక్ష్మి, మహిళా సమైక్య నేతలు ఎ..విమల, బి.ప్రభావతి, బి.పద్మ, తదితరులు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!