-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » State level karate competitions begin-MRGS-AndhraPradesh
-
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-15T04:43:50+05:30 IST
స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల కరాటే చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నం (స్పోర్ట్సు), మే 14: స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల కరాటే చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కేఎన్‌ఆర్ ట్రస్టు వ్యవస్థాపకుడు, బీజేపీ నాయకులు కరణంరెడ్డి నర్సింగరావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభించి చిన్నారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే క్రీడాంశానికి ఒలింపిక్ గేమ్స్ గుర్తింపు లభించిన నేపథ్యంలో క్రీడాకారులు చిత్తశుద్ధి, క్రమశిక్షణతో సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు కోలా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి జి.ఆనందబాలు, గోవింద్, ఈశ్వరరావు, పోలారావు, సునీల్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నార

