ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మూడేళ్లలో రాష్ట్రం ఎనలేని అభివృద్ధి

ABN, First Publish Date - 2022-05-12T06:35:21+05:30

మూడేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ తెలిపారు.

సమస్యలపై వినతి పత్రం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 ఎమ్మెల్యే గణేశ్‌

నాతవరం, మే 11 : మూడేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ తెలిపారు. మండలంలోని పీకేగూడెంలో బుధవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులంతా సంక్షేమ ఫలాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం  గ్రామ సచివాలయంలో ఎంపీడీవో నాగలక్ష్మితో పాటు సిబ్బందితో సమావేశమై గ్రామంలో అభివృద్ధి పనుల ప్రగతిని తెలుసుకున్నారు.  ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, సెంట్రల్‌ బ్యాంకు డైరెక్టర్‌ అంకంరెడ్డి జమీలు, గన్నవరం పీఏసీఎస్‌ అధ్యక్షుడు గొర్లి వరహాలబాబు, సర్పంచ్‌ లగుడు నాగేశ్వరరావు, పి.జగ్గంపేట సర్పంచ్‌ జీరెడ్డి సోమన్నదొర, ఎంపీడీవో నాగలక్ష్మి, ఈవోపీ ఆర్‌డీ యాదగిరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కె.కోటపాడు : గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్‌ అన్నారు. గొట్లాంలో బుధవారం ఏర్పాటైన గడప గడపకూ మనప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అంతా సద్విని యోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం పలు అభివృద్ధి పనులను జడ్పీటీసీ ఈర్లె అనూరాధతో కలిసి ప్రారంభించారు. నాయకులు చల్లా సత్యనారాయణమూర్తి, గొరుపోటు వెంకటరావు, చీపురుపల్లి అచ్చిబాబు,   సర్పంచ్‌ గంతకర్ల చిన్నమ్మలు, ఎంపీ టీసీ వర్రి రామునాయుడు, ఆదిరెడ్డి వెంకటరావు, దొగ్గ ఉమాశంకర్‌, ఆదిరెడ్డి సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!