-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Spray with mosquito repellent-NGTS-AndhraPradesh
-
దోమల మందును పిచికారీ చేయించుకోవాలి
ABN , First Publish Date - 2022-05-14T06:08:47+05:30 IST
గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబం దోమల మందును ఇంటి లోపల, బయట విధిగా పిచికారీ చేయించుకోవాలని స్థానిక సబ్ యూనిట్ అధికారి బుక్కా చిట్టిబాబు అన్నారు.
సబ్‌యూనిట్ అధికారి బుక్కా చిట్టిబాబు
చింతపల్లి, మే 13: గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబం దోమల మందును ఇంటి లోపల, బయట విధిగా పిచికారీ చేయించుకోవాలని స్థానిక సబ్ యూనిట్ అధికారి బుక్కా చిట్టిబాబు అన్నారు. శుక్రవారం రాజుపాకలు, గొడుగుమామిడిలో జరుగుతున్న దోమల మందు పిచికారీ తీరును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మలేరియా నిర్మూలించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఏప్రిల్ 15 నుంచి 91 గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేస్తున్నామన్నారు. ఇప్పటికి 61 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. మిగిలిన గ్రామాల్లో నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. అలాగే రెండో విడత జూలై ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు పిచికారీ చేస్తామన్నారు.ఈకార్యక్రమంలో ఎంటీఎస్ గుమ్మ యుగంధర్ పాల్గొన్నారు.

