స్పందనకు గైర్హాజరైన 11 మందికి షోకాజ్‌లు

ABN , First Publish Date - 2022-05-14T06:50:41+05:30 IST

జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి హాజరుకాని 11 మంది జిల్లా అధికారులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

స్పందనకు గైర్హాజరైన 11 మందికి షోకాజ్‌లు

హెచ్చరికలతో నోటీసులు జారీ చేసిన కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌


పాడేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి హాజరుకాని 11  మంది జిల్లా అధికారులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గత శుక్రవారం (ఆరో తేదీ) ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 11 శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు హాజరుకాకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. స్పందనకు గైర్హాజరైన డీఎల్‌డీవో జీవీ చిట్టిరాజు, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, ఖాదీ బోర్డు జిల్లా అధికారి వి.పద్మ, జిల్లా అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి డీపీ రంగారావు, డీపీఆర్‌వో గోవిందరాజులు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఒ.అప్పలరాము, నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌ జి.సత్యనారాయణ, జీసీసీ డీఎం కె.పార్వతమ్మ, ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీ డి.రఘు, దేవదాయ శాఖాధికారి టి.అన్నపూర్ణలకు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అధికారులంతా విధిగా హాజరు కావాలని, లేకపోతే  శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. 

Read more