వైజాగ్‌ స్టీల్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ విజేత శివవర్మ

ABN , First Publish Date - 2022-05-14T05:55:15+05:30 IST

: వైజాగ్‌ స్టీల్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా కాకినాడకు చెందిన శివవర్మ నిలిచారు. ఉక్కు క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలు శుక్రవారంతో ముగిశాయి

వైజాగ్‌ స్టీల్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ విజేత శివవర్మ
విజేతకు ట్రోఫీ అందజేస్తున్న ఉక్కు సీజీఎం చక్రభర్తి, క్లబ్‌ ప్రతినిధులు

ఉక్కుటౌన్‌షిప్‌(విశాఖపట్నం), మే 13: వైజాగ్‌ స్టీల్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా కాకినాడకు చెందిన శివవర్మ నిలిచారు. ఉక్కు క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలు శుక్రవారంతో ముగిశాయి. శివవర్మ(కాకినాడ), నవాజ్‌ షరీష్‌(కడప) మధ్య జరిగిన ఫైనల్స్‌ పోరులో శివవర్మ 5-3 తేడాతో విజయం సాధించారు. విజేతలకు ఉక్కు సీజీఎం(వర్క్స్‌) అభిజిత్‌ చక్రభర్తి, క్లబ్‌ కార్యదర్శి ఉమామహేశ్వరరావులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉక్కు క్రీడా విభాగాధిపతి ఎంఎస్‌ కుమార్‌, సభ్యులు పాల్గొన్నారు. 


Read more