ఘనంగా ఎర్నిమాంబ తొలేళ్ల ఉత్సవం
ABN, First Publish Date - 2022-05-15T04:42:02+05:30
జ్ఞానాపురం ఎర్నిమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం శని వారం ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా అమ్మవారి ప్రతిమల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకున్న నగర మేయర్ హరివెంకటకుమారి దంపతులు
విశాఖపట్నం, మే 14: జ్ఞానాపురం ఎర్నిమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం శని వారం ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా అమ్మవారి ప్రతిమల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విగ్రహాలు తలపై పెట్టుకుని మేళా తాళాల మధ్య పూర్ణామార్కెట్ దుర్గాలమ్మగుడి నుంచి కొబ్బరితోట, అచ్చియ్యమ్మపేట మీదుగా జ్ఞానాపురం ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.
అమ్మవారిని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విద్యుద్దీపాలంకరణ ఆకట్టుకుంది. నేడు ప్రధాన పండుగ జరగనుంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శాంతి, జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ సంక్షేమ సంఘం కార్యదర్శి గవర రమణ ఏర్పాట్లు చేశారు.