ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ప్రమాదం అంచున ప్రయాణం

ABN, First Publish Date - 2022-05-11T06:42:49+05:30

పెదబయలు నుంచి ముంచంగిపుట్టు మీదుగా జోలాపుట్టు వరకు సుమారు 32 కిలోమీటర్ల తారు రోడ్డు ఉంది.

పెదబయలు- ముంచంగిపుట్టు మధ్య కిలగాడ వద్ద కోతకు గురైన రోడ్డు మార్జిన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కోతకు గురైన రహదారుల అంచులు

రోడ్లకు ఇరువైపులా పెరిగిపోయిన తుప్పలు

నిర్వహణ పనులు చేపట్టని అధికారులు

ప్రమాదాలబారిన వాహనదారులు

ముంచంగిపుట్టు, మే 10:

పెదబయలు నుంచి ముంచంగిపుట్టు మీదుగా జోలాపుట్టు వరకు సుమారు 32 కిలోమీటర్ల తారు రోడ్డు ఉంది. మండల కేంద్రం నుంచి సంగడ వరకు 35 కిలోమీటర్లు, మండల కేంద్రం నుంచి కుమడకు 11 కిలోమీటర్ల రహదారి ఉంది. బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసే సమయంలో రహదారికి ఇరువైపులా బెర్మ్‌ నిర్మాణం చేపట్టాలి. రోడ్డు బాగా ఎత్తుగా వున్నచోట అంచుల వద్ద రాతిపేర్పు చేసి, మట్టిపోసి రోలింగ్‌ చేయాలి. వర్షపునీరు రహదారులపై నుంచి ప్రవహించకుండా తగిన చర్యలు చేపట్టాలి. కానీ రోడ్డు నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లు, అధికారులు వీటి గురించి పట్టించుకోలేదు. అడుగులుపుట్టు, రంగినిగెడ్డ, కిలగాడ, వనభసింగి, కించాయిపుట్టు,  రాజ్‌మామిడి, పనసపుట్టు, బోండ్రుగూడ, మాకవరం, అస్త్రాడ, సంగడ, కుమడ, కరిముక్కిపుట్టు తదితర ప్రాంతాల్లో రహదారుల అంచులు వర్షపు నీటితో కోతకు గురై గోతులు ఏర్పడ్డాయి. దీంతో రాత్రిపూట ఏమాత్రం అజాగ్రత్తగా వాహనం నడిపినా ప్రమాదానికి గురికాకతప్పదు. కొన్నిచోట్ల తుప్పలు విపరీతంగా పెరిగిపోవడంతో మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనం దగ్గరకు వచ్చే వరకు కనిపించక ప్రమా దాలు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికైనా స్పందించి కోతకు గురైన రోడ్డు అంచుల వద్ద రాతిపేర్పు చేపట్టి, తుప్పలు తొలగించాలని ఆయా పంచాయతీల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!