AP News: అనకాపల్లి జిల్లాలో పాస్టర్ అకృత్యాలు...

ABN , First Publish Date - 2022-11-07T11:46:42+05:30 IST

అనకాపల్లి: జిల్లాలో మరో పాస్టర్ అకృత్యాలు వెలుగు చూశాయి. చర్చికు వచ్చే కొంతమంది మహిళలను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని పాస్టర్ లోబర్చుకున్నాడు.

AP News: అనకాపల్లి జిల్లాలో పాస్టర్ అకృత్యాలు...

అనకాపల్లి: జిల్లాలో మరో పాస్టర్ అకృత్యాలు వెలుగు చూశాయి. చర్చికు వచ్చే కొంతమంది మహిళలను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని పాస్టర్ లోబర్చుకునేవాడు. చిన్న పిల్లలనూ వదలలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. పాస్టర్ చేసే వెధవ పనులన్నింటికీ ఆయన భార్య పూర్తి స్థాయిలో సహకరించింది. చివరికి కుటుంబసభ్యుల ఫిర్యాదుతోనే పాస్టర్ రాసలీలలు వెలుగుచూశాయి.

అనకాపల్లి జిల్లాలో జీసస్ గ్రేస్ పేరుతో విక్టర్ డేవిడ్ పాస్టర్ చర్చి నిర్వహిస్తున్నాడు. చర్చికు వచ్చేవారు డేవిడ్‌ను దైవంగా కొలుస్తారు. అయితే చర్చికు వచ్చే యువతులు, మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డాడు. చాలా మంది మహిళలను పాస్టర్ లోబర్చుకున్నట్లు విచారణలో తెలిసింది. చివరికి కుటుంబసభ్యులను ఇదే దృష్టితో చూడడంతో పాస్టర్ పాపాలు బయటకొచ్చాయి.

పాస్టర్ డేవిడ్ చేసిన లైంగిక నేరాల్లో అతని భార్య కూడా పాలుపంచుకుంది. పాస్టర్ కన్నేసే మహిళలను అతని భార్య మెల్లగా ముగ్గులోకి దించుతుంది. పాస్టర్ భార్య మాటలు నమ్మిన మహిళలు అంతా నిజమేనని నమ్మి ఉచ్చులో పడతారు. ఇలా ఇద్దరూ కలిసి చేసిన దారుణాలు చాలానే ఉన్నాయి. పాస్టర్ చేస్తున్న అకృత్యాలను కుటుంబసభ్యుల ద్వారా తెలుసుకున్న పోలీసులు డేవిడ్ ఆట కట్టించారు. కేసు నమోదు చేశారు. పాస్టర్‌ మద్యం సేవించడం, అమ్మాయిలను అనుభవించడం సరదా.. పరాయి మహిళలను ఇంటికి తీసుకువచ్చి అనుభవించేవాడు. పాస్టర్ అకృత్యాలను వీడియో తీసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నపిల్లలపై కూడా పాస్టర్ అకృత్యాలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో అతనిపై ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డేవిడ్‌ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Updated Date - 2022-11-07T11:46:42+05:30 IST

Read more