ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రైతుబజార్లలో ఆర్గానిక్‌ స్టాల్స్‌

ABN, First Publish Date - 2022-05-08T06:36:12+05:30

విశాఖ, విజయనగరంలోని పలు రైతుబజార్లలో త్వరలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఆర్గానిక్‌ స్టాల్స్‌ను కంటైనర్‌ మోడల్స్‌లో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఎంవీపీ రైతుబజారులోని స్టాల్‌ను పరిశీలిస్తున్న సీఈవో శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పైలెట్‌ ప్రాజెక్టుగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో త్వరలో ఏర్పాటు

రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావు 

ఎంవీపీ కాలనీ, మే 7: విశాఖ, విజయనగరంలోని పలు రైతుబజార్లలో త్వరలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఆర్గానిక్‌ స్టాల్స్‌ను కంటైనర్‌ మోడల్స్‌లో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆయన ఎంవీపీ కాలనీలోని రైతుబజారును పరిశీలించి స్టాల్స్‌లోని రైతులతో మాట్లాడారు. పలు స్టాల్స్‌లో ఫ్లోరింగ్‌ పాడైపోయి కూరగాయలు పెట్టుకోవడం ఇబ్బందిగా వుందని పలువురు రైతులు సీఈవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పరిశీలన జరిపి ఎస్టిమేట్స్‌ రూపొందించి టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్‌ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. హోల్‌సేల్‌ రైతులమైన తమకు నెలవారీ చెల్లించే అద్దెలు ఎక్కువగా వున్నాయని వాటిని తగ్గించాలని పలువురు కోరారు. త్వరలో రైతుబజార్లతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఎంవీపీ రైతుబజారులో పార్కింగ్‌ సమస్యకు చెక్‌ పెడతామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పార్కింగ్‌కు టెండర్ల ప్రక్రియ ఫైనల్‌ దశలో వుందని, వారం రోజుల్లోగా పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబజార్ల ఇన్‌చార్జి పాపారావు, అగ్రికల్చర్‌ డీడీ మోహన్‌రావు, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఏడీ కాళేశ్వరరావు, ఈఈ జయశేఖర్‌, డీఈ కెనడీ, తదితరులు పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!