ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో మరో Twist..

ABN, First Publish Date - 2022-05-13T17:45:33+05:30

పెళ్లి పీటలపైనే వధువు మృతి కేసులో మరో Twist..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విశాఖపట్నం : విశాఖపట్నంలోని కొమ్మాదిలో పెళ్లి కుమారుడు.. తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మరణించిన విషయం తెలిసిందే. దీంతో వధువు (Bride) మృతిపై పలు రకాలుగా పుకార్లు షికార్లు, ట్విస్ట్‌లు వెలుగుచూశాయి. కొందరు ఆమె విషం తాగిందని.. మరికొందరు గన్నేరు పప్పు తిన్నదని.. పెళ్లి ఇష్టంలేదని ఇంకొందరు ఇలా వార్తలు వచ్చాయి. అయితే.. అసలేం జరిగింది..? ఈ ఘటన ఎలా చోటుచేసుకుందనే విషయాలపై వధువు సోదరుడు విజయ్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించాడు.


అసలేం జరిగింది..!?

ఇద్దరి ఇష్టంతోనే పెళ్లి ఫిక్స్ చేశాం. ఫిబ్రవరిలోనే  పెళ్లి (Marriage) కుదిరింది. ఇరు వర్గాలు కూడా బంధువులమే. సోదరి సృజనకు (Srujana) ఆరోగ్య సమస్య ఉంది. మీడియా వాళ్లు ఎవరి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో అసలు నిజం ఏంటనేది తెలుస్తుంది. సృజన మృతిపై మా కుటుంబంలో ఎవరికీ ఎలాంటి అనుమానం (Doubt) లేదు. పీరియడ్స్ రాకుండా మాత్రలు వాడింది. దీంతో ఆమెకు కడునొప్పి వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అమ్మాయికి ఎటువంటి ఎఫైర్ లేదు. ఈ అకస్మాత్తు ఘటన జరిగినప్పట్నుంచి ఇరు కుటుంబాలు షాక్‌లో (Shock) ఉన్నాయి. ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పెళ్లి రోజు (Marriage) అమ్మాయిని అసుపత్రికి తీసుకెళ్లాం. ఆరోగ్యం కుదుట పడింది. పెళ్లి సమయంలో మళ్ళీ స్పృహ కోల్పోయింది.. అంతే ఇంతకు మించి ఏమీ జరగలేదు అని విజయ్ మీడియాకు వెల్లడించాడు.


కాగా.. ఆమె విషం (Poison) తాగడం వల్లే చనిపోయినట్టు భావించిన ఆస్పత్రి వైద్యులు పీఎం పాలెం పోలీసులకు సమాచారం (Information) అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు (KGH) తరలించారు. సృజన మృతిపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక దానికి అనుగుణంగా దర్యాప్తు చేస్తామని పీఎం పాలెం పోలీసులు తెలిపారు. సృజన హ్యాండ్‌బ్యాగ్‌లో గన్నేరుపప్పు ఉన్నట్టు తెలిసింది. ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆమె ఇష్టప్రకారమే పెళ్లి జరుగుతోందని చెబుతున్నారు.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!