చంద్రబాబు డబ్బు కోసం పనిచేస్తే.. జగన్ జనం కోసం పని చేస్తున్నారు: Amarnath

ABN , First Publish Date - 2022-05-04T20:38:07+05:30 IST

విశాఖ: నగరంలో ఏపీ ఫైబర్ నెట్‌వర్క్ కార్యాలయాన్ని ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.

చంద్రబాబు డబ్బు కోసం పనిచేస్తే.. జగన్ జనం కోసం పని చేస్తున్నారు: Amarnath

విశాఖ: నగరంలో ఏపీ ఫైబర్ నెట్‌వర్క్ కార్యాలయాన్ని ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు డబ్బు కోసం పనిచేస్తే.. జగన్ మోహన్ రెడ్డి జనం కోసం పని చేస్తున్నారని అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్ నెట్ అందిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ వర్క్‌ను ఎనర్జీ విభాగం నుంచి పరిశ్రమల విభాగానికి మార్చడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 10 లక్షల కనెక్షన్లు ఏపీలో ఫైబర్ నెట్ వర్క్ ద్వారా అందిస్తున్నామని, ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్ల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

Read more