ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

భూ సర్వే పనులను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-14T05:52:05+05:30

సమగ్ర భూ సర్వే పనులను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ జీఎస్‌ విశ్వనాథన్‌ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు.

కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జేసీ విశ్వనాథన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌

పద్మనాభం, మే 13: సమగ్ర భూ సర్వే పనులను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ జీఎస్‌ విశ్వనాథన్‌ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. మండలంలోని చిన్నాపురంలో చేపడుతున్న భూ సర్వే పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రోజుకు 30 ఎకరాల వరకు సర్వే చేయాల్సి వుండగా.. ఎంత విస్తీర్ణంలో సర్వే జరుగుతోందని సర్వేయర్లను ప్రశ్నించారు. రోజుకు 15 ఎకరాల వరకు సర్వే జరుగుతుందని వారు చెప్పడంతో, ఇలా నెమ్మదిగా పనులు జరిగితే పనులు ఎప్పటికి పూర్తవుతాయని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రెడ్డిపల్లి జగనన్న కాలనీ లేఅవుట్‌ను పరిశీలించిన ఆయన పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాన్ని జేసీ సందర్శించి పనితీరుపై ఆరా తీశారు. కొత్తగా కడుతున్న భవనం పనులను పరిశీలించారు. రైతులకు ఖరీఫ్‌లో సరఫరా చేయనున్న విత్తనాల వివరాలతో పాటు పంపిణీ చేస్తున్న వ్యవసాయ పరికరాల గురించి వ్యవసాయాధికారి ఎల్‌ఏ కాంతమ్మను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో విత్తనాలు సరఫరా చేయాలన్నారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ సేవలందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఫీవర్‌ సర్వేను క్రమం తప్పకుండా చేపట్టాలని జేసీ సూచించారు. ప్రతీరోజు సచివాలయంలో నిర్వహించే స్పందనలో వచ్చే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జేసి వెంట ఎంపీడీఓ జీవీ చిట్టిరాజు, ఉప సర్పంచ్‌ ఎస్‌.ఆదిబాబు, లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ ఈశ్వరరావు, తదితరులు ఉన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!