కర్రినాయుడు మృతి టీడీపీకి తీరని లోటు

ABN , First Publish Date - 2022-05-14T06:12:50+05:30 IST

మండలంలో అడ్డుమండకి చెందిన టీ డీపీ నేత, మాజీ సర్పంచ్‌ తాంగుల కర్రినాయుడు (50) మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

కర్రినాయుడు మృతి టీడీపీకి తీరని లోటు
కర్రినాయుడుకు నివాళులు అర్పిస్తున్న కిడారి, మణికుమారి, తదితరులు



మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌

హుకుంపేట, మే 13: మండలంలో అడ్డుమండకి చెందిన టీ డీపీ నేత, మాజీ సర్పంచ్‌ తాంగుల కర్రినాయుడు (50) మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన కర్రినాయుడు పార్ధివదేహనికి శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి మణికుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ వంజంగి కాంతమ్మ, ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం, టీడీపీ నేతలు శెట్టి లక్ష్మణుడు, బాకూరు వెంకటరమణరాజు, పాండురంగస్వామి, పి.కామేశ్వరరావు, అర్జునుడు, తదితరులు నివాళులు అర్పించి, కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని వారంతా పేర్కొన్నారు.  


Read more