-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Jagan who did not fulfill the election promises-NGTS-AndhraPradesh
-
ఎన్నికల హామీలను నెరవేర్చని జగన్
ABN , First Publish Date - 2022-05-14T06:09:50+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నప్పటికీ వైఎస్.జగన్ ఎన్నికల హామీలనే నెరవేర్చలేదని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరావు ధ్వజమెత్తారు.
గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు
పాడేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నప్పటికీ వైఎస్.జగన్ ఎన్నికల హామీలనే నెరవేర్చలేదని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరావు ధ్వజమెత్తారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు నేటికీ నెరవేరలేదన్నారు. అలాగే నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, బస్సు ఛార్జీలు, విద్యుత్ బిల్లులు అధికంగా పెంచేసి సామాన్యులపై తీవ్రమైన భారం మోపారన్నారు. గిరిజనులకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదని విమర్శించారు. సీఎం తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం కావడం, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక పాలనపై బీజేపీ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కురసా రాజారావు, బీవీ.భారతి, కారక చిన్నయ్య, సల్లా రామకృష్ణ, రాజు, అర్జున, చంద్రరావు, అప్పలరాజు పాల్గొన్నారు.

