ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తే భూములిస్తాం

ABN , First Publish Date - 2022-05-14T06:17:20+05:30 IST

వైద్య కళాశాల ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఎకరాకు రూ.30 లక్షలు నష్టం పరిహారం చెల్లించాలని భీమబోయినపాలెం సర్పంచ్‌ రుత్తల నందకిశోర్‌తో పాటు 40 మంది రైతులు తేల్చి చెప్పారు.

ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తే భూములిస్తాం
సరైన ప్యాకేజీ ఇస్తే భూములు ఇస్తామని తహసీల్దార్‌కు చెపుతున్న సర్పంచ్‌

  వైద్య కళాశాల ఏర్పాటుకు  భూముల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన రెవెన్యూ అధికారులు

  కోరిన ప్యాకేజీతో పాటు ఒక్కొక్కరికీ 15 సెంట్లు చొప్పున భూమి ఇవ్వాలని రైతులు పట్టు 

 ఆ తరువాతే సర్వే చేయాలని స్పష్టీకరణ 

మాకవరపాలెం, మే 13 : వైద్య కళాశాల ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఎకరాకు రూ.30 లక్షలు నష్టం పరిహారం చెల్లించాలని భీమబోయినపాలెం సర్పంచ్‌ రుత్తల నందకిశోర్‌తో పాటు 40 మంది రైతులు తేల్చి చెప్పారు. వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం గ్రామానికి చెందిన రైతులతో ఇక్కడి మండల పరిషత్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ కనకా రావు శుక్రవారం ఎంపీపీ రుత్తల సత్యనారాయణ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి తహసీల్దార్‌ మాట్లాడుతూ భీమబోయినపాలెంలో 5, 9 సర్వే నం బర్లలో 44మంది రైతులు సుమారు 120ఎకరాల ప్రభుత్వ డి.పట్టా భూము లను సాగు చేస్తున్నారన్నారు.  ఆ భూమిని మెడికల్‌ కాలేజీ నిర్మాణం కోసం తీసుకుంటున్నామని, ఎకరాకు 17.5 లక్షలతో పాటు అదనపు చెట్లకు పరి హారం చెల్లిస్తామని తెలిపారు. ఇంతలో సర్పంచ్‌, రైతులు అడ్డుతగిలారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా మని, అయితే ఎకరాకు రూ.30లక్ష లతో పాటు  భూములు కోల్పోయిన  రైతులకు 15సెంట్లు చొప్పున భూమిని పరిహారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  డిమాండ్లకు కలెక్టర్‌, ఆర్డీవో, ఎమ్మెల్యే  సమక్షంలో పరిష్కారం చూపిన తరువాతే భూముల్లో సర్వే చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల డిమాండ్లను  ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకువెళతానమని, రైతు లకు నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు.  వైస్‌ ఎంపీపీ రాజారావు, రామన్నపాలెం సర్పంచ్‌ అయ్యప్పతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.  ఇదిలావుంటే, ప్రజాభిప్రాయ సేకరణలో సూపర్‌ జడ్పీ టీసీ పెట్ల భద్రాచలం హవా కొనసాగింది. జడ్పీటీసీ భర్త సత్యవేణి బదులు అతను సమావేశానికి హాజరై రైతులు భూములను త్యాగం చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం సరైన పరిహారం చెల్లిస్తుందని చెపుతుండగా,  భీమబోయినపాలెం సర్పంచ్‌ నందకిశోర్‌ ఎదురు ప్రశ్నలు వేశారు. ఇంకా భూమి తీసుకోక ముందే వైసీపీ నాయకుడు పేరిట భూమి ఉన్నట్టు అడంగళ్‌లో ఎలా వచ్చిందని ప్రశ్నిం చారు.  భీమబోయినపాలేనికి చెందిన 271 ఖాతా నంబరులో 132/2 సబ్‌ డివిజిన్‌లో స్థానిక వైసీపీ నాయకుడు వెంకటరమణ పేరిట ఐదు ఎకరాల భూమి సాగులో లేకుండా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.

Read more