ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

దళితుల గడప ఎలా ఎక్కుతారు?

ABN, First Publish Date - 2022-05-15T05:16:15+05:30

దళితుల పథకాలన్నీ రద్దు చేసి, రుణాలను ఎత్తివేసి ఏం ముఖం పెట్టుకుని దళితుల గడప తొక్కుతారని వైసీపీ నేతలకు విదసం కన్వీనర్‌ బూసి వెంకటరావు ప్రశ్నించారు.

ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దళిత నాయకులు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విదసం కన్వీనర్‌ బూసి వెంకటరావు 

సిరిపురం, మే 14: దళితుల పథకాలన్నీ రద్దు చేసి, రుణాలను ఎత్తివేసి ఏం ముఖం పెట్టుకుని దళితుల గడప తొక్కుతారని వైసీపీ నేతలకు విదసం కన్వీనర్‌ బూసి వెంకటరావు ప్రశ్నించారు. ఎస్సీల సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గడప గడపకు వైసీపీ ప్రభుత్వం’లో భాగంగా దళితుల గడపకు ఎమ్మెల్యేలు వస్తే తాము చెప్పేందుకు ఒక పథకం కూడా లేదన్నారు. జగన్‌ సర్కార్‌ ఎస్సీల అభ్యున్నతికి ప్రత్యేక పథకాల కోసం ఇచ్చే సబ్‌ ప్లాన్‌ నిధులన్నింటినీ నవరత్నాలకు మళ్లించిందని మండిపడ్డారు. వివిధ కార్పొరేషన్లకు రూ.కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు ఒక రూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ గడపకు వచ్చి కుశల ప్రశ్నలు వేసే హక్కు జగన్‌ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు ఈతలపాక సుజాత, వడ్లమూరి ప్రాన్సిస్‌, కె.హరిబాబు, చంద్రశేఖర్‌, కోటి జాన్‌, సోడదాసు సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!