-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » How do Dalits climb the threshold-MRGS-AndhraPradesh
-
దళితుల గడప ఎలా ఎక్కుతారు?
ABN , First Publish Date - 2022-05-15T05:16:15+05:30 IST
దళితుల పథకాలన్నీ రద్దు చేసి, రుణాలను ఎత్తివేసి ఏం ముఖం పెట్టుకుని దళితుల గడప తొక్కుతారని వైసీపీ నేతలకు విదసం కన్వీనర్ బూసి వెంకటరావు ప్రశ్నించారు.
విదసం కన్వీనర్ బూసి వెంకటరావు
సిరిపురం, మే 14: దళితుల పథకాలన్నీ రద్దు చేసి, రుణాలను ఎత్తివేసి ఏం ముఖం పెట్టుకుని దళితుల గడప తొక్కుతారని వైసీపీ నేతలకు విదసం కన్వీనర్ బూసి వెంకటరావు ప్రశ్నించారు. ఎస్సీల సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గడప గడపకు వైసీపీ ప్రభుత్వం’లో భాగంగా దళితుల గడపకు ఎమ్మెల్యేలు వస్తే తాము చెప్పేందుకు ఒక పథకం కూడా లేదన్నారు. జగన్ సర్కార్ ఎస్సీల అభ్యున్నతికి ప్రత్యేక పథకాల కోసం ఇచ్చే సబ్ ప్లాన్ నిధులన్నింటినీ నవరత్నాలకు మళ్లించిందని మండిపడ్డారు. వివిధ కార్పొరేషన్లకు రూ.కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు ఒక రూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ గడపకు వచ్చి కుశల ప్రశ్నలు వేసే హక్కు జగన్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు ఈతలపాక సుజాత, వడ్లమూరి ప్రాన్సిస్, కె.హరిబాబు, చంద్రశేఖర్, కోటి జాన్, సోడదాసు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

