విదేశీ విద్యార్థులు గీతం రాయబారులు

ABN , First Publish Date - 2022-05-15T05:09:57+05:30 IST

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో స్టడీ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పొందిన పలు దేశాల విద్యార్థులను అంతర్జాతీయంగా గీతం పేరు ప్రఖ్యాతలను విస్తరించే వర్సిటీ రాయబారులుగా పరిగణిస్తామని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ పేర్కొన్నారు.

విదేశీ విద్యార్థులు గీతం రాయబారులు
పట్టభ్రదుల దినోత్సవంలో రిజిస్ట్రార్‌ గుణశేఖరన్‌, విదేశీ విద్యార్థులు

ప్రత్యేక పట్టభద్రుల దినోత్సంలో రిజిస్ర్టార్‌ గుణశేఖరన్‌

ఎండాడ, మే 14: గీతం డీమ్డ్‌  విశ్వవిద్యాలయంలో స్టడీ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పొందిన పలు దేశాల విద్యార్థులను అంతర్జాతీయంగా గీతం పేరు ప్రఖ్యాతలను విస్తరించే వర్సిటీ రాయబారులుగా పరిగణిస్తామని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ పేర్కొన్నారు. గీతంలో వివిధ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశాలకు తిరిగి వెళతున్న విద్యార్థులకు జిమ్‌సర్‌ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేక పట్టభద్రుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుందని, చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. గీతం అంతర్జాతీయ విద్యా వ్యవహారాల విభాగం డైరెక్టర్‌ కేపీసీ కిషన్‌ మాట్లాడుతూ 54 దేశాలకు చెందిన 400 మంది విదేశీ విద్యార్థులు గీతం విశాఖ, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాలలో పలు కోర్సులను అభ్యసిస్తున్నారన్నారు. ఈ ఏడాది 68 మంది విదేశీ విద్యార్థులు వివిధ కోర్సులను పూర్తి చేశారని పేర్కొన్నారు. కోర్సులు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులను గుణశేఖరన్‌ అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. 

గీతం అధ్యాపకులు ఎంతో సహకరించారు

-విదేశీ విద్యార్థులు అయ్యాబా (ఘనా దేశం), ఇమ్యూన్యూయల్‌ (లైబేరియా), ఫెలీస్టాస్‌ (జింబాబ్వే)

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యాపకులు తమకెంతో సహకరించారని విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌ లభించడంతో ఎన్నో పరిశీలనలు చేశాక ‘గీతం’లో జాయినై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలన్న తన కలను సాకారం చేసుకున్నానని అయ్యాబా తెలిపాడు. ఉన్నత విద్యను కూడా గీతంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానన్నాడు. గీతంలో ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సు పూర్తి చేసిన తాను పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని ఇమ్యూన్యూయల్‌  పేర్కొన్నాడు. చార్టడ్‌ అకౌంటెంట్‌ కావాలన్న లక్ష్యంతో తాను గీతంలో బీకామ్‌ హానర్స్‌ కోర్సు పూర్తి చేశానని ఫెలీస్టాస్‌ తెలిపింది.


Read more