-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » devotees flocked to see their appanna-MRGS-AndhraPradesh
-
అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-05-15T05:19:00+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం అనూహ్యంగా భక్తులు పోటెత్తారు.
ఒక్కరోజు ఆదాయం రూ.42 లక్షలు
సింహాచలం, మే 14: వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవు రోజు కావడం, ఒడిశా ఆధ్యాత్మికవేత్త లక్ష్మీకాంత్ నాయకోదాసుడు శిష్య బృందంతో ఇక్కడే వుండడం, రెండు రోజులుగా పెళ్లిళ్లు చేసుకున్న కొత్త జంటలు బంధుమిత్రులతో కలిసి రావటంతో సింహగిరిపై సందడి నెలకొంది. దీంతో శనివారం ఉదయం కొండదిగువ వరాహపుష్కరిణి, సింహగిరిపై కేశఖండనశాల, దర్శనాల క్యూలలో, నీలాద్రి గుమ్మంవద్ద, ప్రసాదాల కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. భక్తుల తాకిడి కారణంగా శనివారం ఒక్కరోజే అప్పన్న స్వామి ఖజానాకు సుమారు రూ.38 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 14 వేల అతిశ్రీఘ్ర, శ్రీఘ్ర దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.25,60,380 ఆదాయం లభించగా, లడ్డూ, పులిహోర ప్రసాదాల అమ్మకాల ద్వారా సుమారు రూ.9,81,685, రూ.25 తలనీలాల టికెట్ల విక్రయాలతో రూ.2,90,100, ఆర్జిత సేవల టికెట్లతో రూ.1,07,975, రవాణా విభాగం ద్వారా రూ.1,17,128, అన్నప్రసాద విరాళాలు రూ.1,57,176, తదితర అన్ని విభాగాల ద్వారా మొత్తం రూ.42.1 లక్షల ఆదాయం వచ్చింది. భక్తులకు తాగునీరు, నీడ కల్పించడంలో అధికారులు సఫలమయ్యారు.

