కెమికల్‌ కళాశాల అభివృద్ధికి సహకరించండి

ABN , First Publish Date - 2022-05-14T05:37:22+05:30 IST

విద్యార్థుల ఉపాధికి బాసటగా నిలుస్తున్న విశాఖ కంచరపాలెంలోని కెమికల్‌ కళాశాల అభివృద్ధికి చేయూతనందించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.రమణ ఆధ్వర్యంలో అధ్యాపకులు అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి.సత్యవతికి విజ్ఞప్తి చేశారు.

కెమికల్‌ కళాశాల అభివృద్ధికి సహకరించండి
అనకాపల్లి ఎంపీ సత్యవతికి పుష్పగుచ్ఛం అందిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.రమణ ,అధ్యాపకులు

ఎంపీ సత్యవతికి ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల వినతి

విశాఖపట్నం, మే 13 : విద్యార్థుల ఉపాధికి బాసటగా నిలుస్తున్న విశాఖ కంచరపాలెంలోని కెమికల్‌ కళాశాల అభివృద్ధికి చేయూతనందించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.రమణ ఆధ్వర్యంలో అధ్యాపకులు అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి.సత్యవతికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో వీరు ఎంపీని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. నిధుల్లేక కళాశాలలో అదనపు భవనాల నిర్మాణం నిలిచిపోయిందని ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లారు. మూడేళ్ల క్రితమే భవన నిర్మాణాలు ప్రారంభమైనా నిధుల కొరతతో ముందుకు సాగడం లేదని తెలిపారు.


పలు పరిశ్రమలు తమ సీఎస్‌ఆర్‌ పథకం నిధులు వేర్వేరు కార్యక్రమాలకు అందజేస్తు న్నాయని, అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి తమ కళాశాలకు కూడా నిధులు కేటాయించేలా సహకరించాలని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారని ప్రిన్సిపాల్‌ రమణ తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో స్టీల్‌ ప్లాంట్‌ జీఎం డాక్టర్‌ ఓ.ఆర్‌.ఎం.రావు, అధ్యాపకులు డాక్టర్‌ బి.లక్ష్మణరావు పాల్గొన్నారు. 

Read more