-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Child marriages should be prevented-NGTS-AndhraPradesh
-
బాల్య వివాహాలు అరికట్టాలి
ABN , First Publish Date - 2022-05-14T05:39:01+05:30 IST
బాల్యవివాహాలు అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాధశర్మ అభిప్రాయపడ్డారు.
అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి హరిహరనాథశర్మ
విశాఖపట్నం, మే 13: బాల్యవివాహాలు అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాధశర్మ అభిప్రాయపడ్డారు. బాల్యవివాహాల నిషేధ చట్టం అంశంపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో శుక్రవారం జిల్లా కోర్టుల లైబ్రరీ ఆవరణలో జరిగిన ప్రత్యేక న్యాయ అవగాహనా సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. శారీరక, మానసిక పరిపక్వత లేని వయస్సు ఉన్నవారికి వివాహాలు చేయడం వల్ల ఎన్నో అనర్థాలకు ఆస్కారం కలుగుతుందని, చట్టం కూడా దాన్ని సమర్థించదని చెప్పారు.
ఈ సందర్భంగా చట్టం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.కె.వి.బులికృష్ణ, నగర పోలీస్ డిప్యూటీ కమిషనర్ డి.గంగాధరమ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రవీంధ్ర ప్రసాద్, జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు రెహమున్నీసాబేగమ్, సీటీపీవో రమణకుమారి, న్యాయవాది ఎల్.వి.రమణి, హిందు, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.

