‘చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలి’

ABN , First Publish Date - 2022-05-14T06:10:50+05:30 IST

మండల కేంద్రంలో చిరుత సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సప్పర్ల అటవీ శాఖ సెంక్షన్‌ అధికారి(ఎఫ్‌ఎస్‌వో) చిరంజీవి అన్నారు.

‘చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలి’
పి.కొత్తూరులో అవగాహన కల్పిస్తున్న సెక్షన్‌ అధికారి చిరంజీవి


గూడెంకొత్తవీధి, మే 13: మండల కేంద్రంలో చిరుత సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సప్పర్ల అటవీ శాఖ సెంక్షన్‌ అధికారి(ఎఫ్‌ఎస్‌వో) చిరంజీవి అన్నారు. శుక్రవారం పి.కొత్తూరు గిరిజనులతో అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరుత ప్రధానంగా సప్పర్ల-జీకేవీధి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఒంటరిగా వృద్ధులు, చిన్నపిల్లలు తిరగరాదన్నారు. మల, మూత్రవిసర్జనకు వెళ్లే సమయంలో గిరిజనులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు చిరుత వల్ల ఎవరికి ఎటువంటి హాని కలగలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీవోలు వరహాలు, శ్రీరాములు, బిందు, వీఆర్‌వో రామారావు పాల్గొన్నారు. 

Read more